
సింగీతం శ్రీనివాసరావు గారి మీద రీసెర్చ్ చేస్తుంటే, ఒక చిక్కొచ్చింది. ఆయన వికీపీడియా పేజీ అంతా లింకుల మయం. చదవడం కొంచెం కష్టంగా ఉన్న ఆయన సాధించిన విజయాలు, పొందిన సత్కారాల వివరాలు అబ్బురపరిచాయి. సింగీతం గారి చిత్రాలంటే తెలుగు వారికి ఆదిత్య 369, భైరవ ద్వీపం; తమిళులకు మైఖేల్ మదన కామ రాజన్, అపూర్వ సహోదరగళ్; కన్నడ వారికి హాలు జేను, చలిసువ మోడగళు, భాగ్యదా లక్ష్మి బారమ్మ గుర్తొస్తాయి. కానీ అందరికీ ముందుగా గుర్తొచ్చేది పుష్పక్, లేదా పుష్పక విమానం.
Read more
“ప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి…” ఈ పదాలు నేను అంటుంటే, background లో పాట బాణీ ఈపాటికి లీలగా మీకు వినిపిస్తూ ఉండుంటుంది. ఆ వెంటనే స్ఫురించే మరో విషయం, ఆ సినిమా పేరు, ఏకవీర. నా చిన్నప్పుడు టీవిలో ఈ చిత్రం చూసినప్పుడు ఏవి అర్థం కాలేదు. కారణం, జానపద చిత్రాల హీరో కాంతా రావు, ఎన్టీఆర్ కలిసి నటిస్తుండడం, చిత్రం పేరే ఏకవీర అవడంతో ఏ అగ్గిపిడుగు, కంచుకోట లా ఉండి, బోలెడన్ని కత్తి యుద్దాలు ఉంటాయనుకుంటే, అంతా ఏడుపే.
Read more
1955 లో ఉడన్ ఖొటాల అనే హిందీ చిత్రం విడుదలయ్యింది. ఈ చిత్రానికి నిర్మాత, సంగీత దర్శకుడు, నౌషాద్. ఇది తమిళ్ లో డబ్ చేయబడి, ‘వాన రథం’ గా విడుదలయ్యింది. దీనిలో పాటలు హిందీలో లతా మంగేష్కర్ చేత, తమిళంలో రావు బాలసరస్వతి చేత పాడిద్దామని నౌషాద్ ప్రణాళిక. రావు బాలసరస్వతిని బొంబాయికి రప్పించి రెండు పాటలు రికార్డు చేయించారు..
Read more