ఆగిపో బాల్యమా..

Meena Yogeshwar
May 15, 2024

గేదెల చెరువులో ముక్కు మూసుకుని ఎక్కువ సేపు మునిగి ఉండడం, గుడి కోనేట్లో దిగి ఎక్కువ తామరపూవులు కోయగలగడం, మామిడి చెట్లపై రాళ్ళ దాడి చేసి-పాలేర్ల చేతులకి చిక్కకుండా పళ్ళు దొంగలించగలగడం, వేప చెట్లకు ఉండే తేనెపట్లు కొట్టి తేనె తాగడం, మాగాయి కోసం ఎండబెట్టుకున్న మామిడి ముక్కల ఊటను పావనం చేయడం, ఎదురింటి వారి కోడిని దొంగిలించి - పక్కింటివారి బుట్టలో దాచి వాళ్ళూ వీళ్ళు దెబ్బలాడుకునేలా చేయడం మన చిన్నతనాన్ని గుర్తు చేసే మరిన్ని విషయాలు...

Read more

పిబరే త్యాగరసం…

Meena Yogeshwar
May 6, 2024

సాహిత్యాన్ని ఆలోచనామృతం అన్నారు మన ఋషులు. తవ్వే కొద్దీ ఊరే ఊటబావి లాంటిది సాహిత్యం. కేవలం ఒక పదంగా కనపడుతున్నా, దాన్ని ఒక వాక్యంలో పొదిగితే ఎంతో అద్భుతంగా ధ్వనిస్తుంది. ఒక భావానికి రూపు కట్టాలన్నా, ఒక ఆలోచనకు ప్రాణం పోయాలన్నా ఒక్క పదం చాలు కొన్నిసార్లు. ఇక ఆ ఒక్క పదంతో వినేవారి దృష్టికోణంలోనే మార్పు వస్తే అదెంతటి అద్భుతం. అలాంటి అద్భుతం ఒక్కసారి చేస్తేనే కవి జన్మ ధన్యం అయిపోతుంది. రాసిన కీర్తనల్లో అత్యధిక భాగం ఇలా ఒక్క పదంతో కొత్త ప్రాణం పోస్తే ఆయన్ని...

Read more

అచ్చ తెలుగువాడు త్యాగయ్య రాముడు

Meena Yogeshwar
May 1, 2024

రెండు తరాల క్రితం తెలుగునాడును వదిలిపెట్టి, శరభోజీ అనే మరాఠీ రాజుగా ఉన్న, ఇంగ్లీషు వాళ్ళ ప్రధాన పరిపాలన కొనసాగుతున్న, ముస్లిం రాజుల దండయాత్రలు చవి చూసిన, నేర్చుకునే శిష్యులతో సహా అత్యధిక శాతం తమిళిలున్న తమిళ ప్రాంతంలో, తెలుగులో కీర్తనలు చేయడం గొప్పే. తెలుగు నేర్చుకుంటే తప్ప తన కీర్తనలు నేర్పను అని శిష్యులకు షరతు పెట్టడం గొప్పే. రాసిన కొన్ని వేల కీర్తనల్లో, మిగిలిన 800 కీర్తనల్లో పట్టుమని పది కూడా సంస్కృతం తప్ప పరభాషా పదాలు వాడకపోవడం...

Read more