అనిరుద్ధబ్రహ్మరాయలు మూగదేవిని ఎందుకు రాజకోటలోకి తీసుకువస్తారు? ఆయన చేసిన నేరమేమిటి? మూగదేవి చక్రవర్తిని చూడడం,చక్రవర్తి కొన్ని ఏళ్లుగా పడుతున్న వేదనకు కారణం, నేలమాళిగలో జరుగుతున్న కుట్ర, ఆదిత్య కారకాలన్ కు తెలిసిన నిజం, అతనికి రానున్న అపాయం ఏమిటి వంటి వాటితో పాటు,నందిని యొక్క వ్యక్తిత్వ వివరణ వివరించిన తీరు ఈ భాగంలో వినండి.
ఈ భాగంలో పాండ్యరాజు మరణం పై పాగా తీర్చుకునేందుకు ఒక్కసారిగా సుందరచోళుని, అరుళ్ మౌళి వర్మను, ఆదిత్య కరికాలన్ ను చంపడానికి పన్నాగం వేసుకుంటారు పాండ్య రాజ అనుచరులు. మాయామోహిని నందిని మోహంలో ఉన్న పెద్ద పలువెట్టరయ్యర్ కు ఈ విషయం తెలిసి కాపాడడానికి ప్రయత్నిస్తారు. అరుళ్ మౌళి వర్మను వెన్నంటి కాపాడుతూ ఉన్న మూగదేవి సుందరచోళుని కాపాడడంలో తన ప్రాణాలు కోల్పోతుంది. అరుళ్ మౌళి వర్మ కుట్ర నుంచి ఎలా తప్పించుకున్నాడు? ఆదిత్య కరికాలన్ ను ఎవరు చంపారు? నందిని ఏమైంది? వినండి.
పొన్నియిన్ సెల్వన్ ను కలుసుకున్న వంతిదేవుడు కుందవై ఇచ్చిన సమాచారం తెలిపి అతనితో పాటు తన పయనం సాగిస్తాడు. పొన్నియిన్ సెల్వన్ తనను ఒక మూగ రాణి ఎలా కాపాడుతున్నదో వివరిస్తాడు. వారిద్దరూ పయనమై వెళుతుండగా సముద్రంలో జరిగే ప్రమాదాన్ని తప్పించుకుని, పొన్నియిన్ సెల్వన్ ను చూడామణి విహారంలో విడచి, అక్కడ నుండి కారకాల వల్లవన్ కు ఎదురవుతున్న అపాయం నుండి అతనిని కాపాడడానికి వంతిదేవుడు బయలుదేరతాడు. . నందిని చేసే రహస్య కార్యక్రమాలు ఏమిటి? వంతి దేవుని నందిని ప్రతిసారి ఎందుకు కాపాడుతోంది?ఇంకా సుందర చోళుని గతం ఏమిటి? వినండి ఈ భాగంలో.
మొదటిభాగంలో రాయబారిగా బయలుదేరిన వంతిదేవుడు గందమారన్ కోటలోని కురవై ఆటను చూసి, అక్కడి రహస్య సమావేశాలను విని, రానున్న అపాయం గురించి యువరాణి కుందవైకి చెప్పటానికై బయలుదేరగా తనపై మిత్రద్రోహిగా అభాండం పడుతుంది. కావేరినదిని పుంగుళిని అనే పడవపిల్ల సాయంతో దాటి కుందవైకి విషయం చెప్పి మరల అరుళ్ మౌళి వర్మను కలుసుకున్న కథను వినండి.
పాతాళ చెరసాల నుంచి వంతిదేవుడు, ఒక పిచ్చివాడు తప్పించుకుంటారు. ఆ పిచ్చివాడు ఎవరు? అతనికి తెలిసిన నిజం ఏమిటి? సింబియన్ మహాదేవికి పుట్టిన మధురాంతకుడు ఎవరు? గంధమారన్ చంపినది ఎవరిని? పెద్దపలువెట్టరయ్యర్ తనపై హత్యానేరన్ని ఎందుకు వేసుకున్నారు? అతివైభవంగా జరిగిన పట్టాభిషేకంలో ఎవరికి పట్టం గట్టారు? ఎంతో ఉత్సుకతతో సాగే ఈ చోళరాజుల చరిత్రను నాగరాజన్ గారు రాసిన ఈ చివరి భాగంలో వినండి.
మన భారత దేశాన్ని ఇప్పటి ప్రజాస్వామ్య పాలనకు పూర్వం ఎందరో రాజులు పరిపాలించారు. పాండ్యులు, పల్లవులు, కాకతీయులు, చోళులు... ఇంకా అనేకులు. వీరిలో ఎనలేని కీర్తిప్రతిష్టలు సంపాదించినవారు కోకొల్లలు. ఎన్నో యుధ్ధాలు చేసి రాజ్యాన్ని విస్తరింపజేయటంలో అనేక కష్టాలు పడ్డారు. చరిత్రలో మనం కొంతమందినే తలచుకుంటాము. వారు చేసిన యుధ్ధాలు, సాధించిన విజయాలు మాత్రమే వింటాము. కానీ, చరిత్రలో ఒక రాజు చిన్నప్పటి నుంచి జరిగిన కథను ఆయన సంపాదించిన కీర్తిని తెలుసుకుందాం. మరి ఆ రాజు ఎవరో, అతను ఏ రాజవంశానికి చెందినవాడో,అతని వెనక జరిగిన కుట్రలేమిటో వినండి.
రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. వారి కీర్తులు, అపకీర్తులు జనాల నోటి వెంట పదాలుగా, జనపదాలుగా, పద్యాలుగా మారి తరతరాలుగా, శతాబ్దాలకు పైగా సాగి చరిత్రగా నిలిచిపోయాయి. అలాంటి వాటిని నిజం చేస్తూ ఇప్పుడు తమిళనాడులో శాసనాలు, తాళపత్రాలు, తామ్ర పత్రాలు బయట పడ్డాయి. ఇదే చరిత్ర, విలేఖరి కృష్ణమూర్తిని ఆకర్షించింది. తమిళనాడులో పురావస్తు శాఖవారికి దొరికిన ఎన్నో పత్రాలను ఆయన చదివారు. తిరువాలంకాడులో దొరికిన తామ్ర పత్రాల లో ఉన్న ఒక మాట ఆయన దృష్టిలో పడి ఆసక్తి కలిగించింది. ఆ మాట ఏమిటంటే ...