
కాఫీ పొడిలో రాత్రి పోసిన నీళ్ళు, తెల్లార్లూ ఒక్కో చుక్కా, ఒక్కో చుక్కా దిగుతూ పొద్దున్నకి చిక్కటి, కమ్మటి డికాషన్‌గా మారినట్టు, ఎన్నో ఏళ్ళు జాగ్రత్తగా నిలువబెట్టిన ద్రాక్షరసం చక్కటి ఫ్రెంచి వైన్‌గా మారినట్టు, నేలలో పాతిన తాటికాయలు కొన్ని నెలలకు తేగల పాతరగా చేతికి వచ్చినట్టు, కొంతమంది రచయితలు తమ అనుభవాలనూ, అనుభూతులనూ ఎన్నో ఏళ్ళు తమ హృదయంలో ఊరబెట్టి మన ఆజన్మాంతం దాచుకోగలిగిన రచనను చేస్తారు. అలాంటివారిలో ఒకరు..
Read more
ఒక గొప్ప పుస్తకం చదివిన తర్వాత కలిగే అనుభవం మాటల్లో వివరించలేనిది. కానీ ఒక్కోసారి దురరదృష్టవశాత్తు ఆ అనుభవం మన ఒక్కరికే ఉండిపోతుంది. మన చుట్టుపక్కల వారో, మన స్నేహితులో, బంధువులో మనం చదివిన పుస్తకమే చదవని వారు ఉంటారు. మనం చదివిన పుస్తకం వారు కూడా చదవాలని, ఆ పుస్తకంలోని పాత్రలను వారు కూడా అవలోకనం చేసుకోవాలని, ఆ ప్రపంచంలో వారు కూడా ప్రయాణించాలని మనకి కూడా ఎంతో కుతూహలంగా ఉంటుంది. ఎందుకంటే...
Read more
తెలుగు సినిమా ఒక రత్నగర్భ. తప్పటడుగులు వేసినా, తన చుట్టూ ఉన్న వాటిని పట్టుకుని నడక నేర్చుకునే పసిపాపలా, మొదట్లో తెలుగు సినిమా కాస్త తడబడినా, తన చుట్టూ ఉన్న కళారుపాల ఊతంతో నిలబడింది. తానే ఒక పెద్ద కళారూపంగా ఎదిగింది. అలా నాటకాలు, కర్ణాటక సంగీతం, శాస్త్రీయ నృత్యం సినిమాకు ఎంతగానో సాయం చేశాయి అనడంలో సందేహం లేదు. ఈ ప్రసంగాలలో శాస్త్రీయ సంగీత, నృత్యాలలో ప్రముఖమైన జావళీలు, పదాలు, సినిమాలోనాయికలు, వారి అవస్థలు, పదం వంటి శాస్త్రీయ నృత్య విషయాలతో మొదలుపెట్టి.....
Read more