
చెట్టుని, జంతువుని కూడా పూజించమని నేర్పించిన మన సంస్కృతి పక్క మనిషిని చంపమని చెప్పింది అంటూ వక్రార్ధాలు తీసే propaganda మనుషుల కుళ్ళు ప్రవచనాలను బాగా ఎక్కించుకుంది మన ప్రజ. నీ దేశానికి వ్యాపారంలోనో, రాజకీయ పరంగానో ఉపయోగపడే దేశం చేసే ఎలాంటి అరాచకాన్నైనా గుడ్డిగా సమర్ధించడం, ఆ దేశం చేసే అత్యాచారాలను ఎలుగెత్తి పొగడడం, ఆ దేశాలు గెలిచినప్పుడు సంబరాలు చేసుకోవడం.. ఎంత నీచానికి ...
Read more
తన పాత్రలపై ఆవిడకి ఉండే అపారమైన ప్రేమ, కరుణ, empathy ప్రతీ అక్షరంలోనూ మనకి తెలిసిపోతాయి. అలాగని కష్టాలు, కన్నీళ్ళు లేని కల్పిత గాథలు కావవి. నేలలోంచి పుట్టుకొచ్చిన అసలుసిసలైన పాత్రలు. వేర్లు ఈ భూమిలో పాతుకుపోయిన నిజమైన పాత్రలవి. ప్రతీవారికీ ఉండే సందిగ్ధాలూ, సందేహాలు, ఆటుపోట్లు, ఇక్కట్లు, మానసిక సంఘర్షణలు అన్నీ వాటికి ఉంటాయి. కానీ ఆ చిక్కుముళ్ళను విడదీసుకోవడానికి తన పాత్రలకు మైథిలీ గారు ఇచ్చే వీలు గొప్పది. తన పాత్రలను అనంతమైన భవసాగరాల్లో కొట్టుకుపోయేలా చేసి, ఆనందించే...
Read more
చదువుకునే చదువు ఒకటైతే, చేసేపని ఇంకోటి. వీధికొకటి పుట్టుకొస్తున్న కళాశాలల్లో విద్య నేర్పే ఉపాధ్యాయులు కరువై కొంత, చిన్నప్పటి నుండే ఏది నేర్చుకోవాలి, ఎందులో స్థిరపడాలి అనే అవగాహన లేక కొంత ఈనాటి యువత చాలా తికమకలో ఉన్నారు. చదువుకున్న చదువులో నిష్ణాతులవ్వడానికి చదివేసిన పుస్తకాలను మళ్ళీ చదువుకోకుండా, బోర్ కొడుతోందని ఫోన్లలో ఇంస్టాగ్రామ్లు, యూట్యూబ్ షాట్స్ చూస్తూ కాలం గడుపుతున్నాం. మన లక్ష్యాలని సాధించడానికి ఒక క్రమ పద్దతిలో నడవకుండా, మనకున్న మాధ్యమాలకి ఆకర్షితులవ్వకుండా అనుసరించాల్సిన పద్దతులు, పాటించవలసిన నియమాలు ఏమిటో ...
Read more