పుస్తకం అంతా తెంగ్లీష్ లోనే ఉంది

Meena Yogeshwar
March 11, 2025

రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ప్రతీదానికి పునర్వైభవం తిరిగి వస్తుంది. అదే జరుగుతోంది తెలుగు సాహిత్యానికి. మళ్ళీ అందరూ పుస్తకాలు చేతబడుతున్నారు. రాసేవాళ్ళు, చదివేవాళ్ళు కూడా పెరుగుతున్నారు. చాలా నాణ్యమైన కాంటెంట్ వస్తోంది. తెలుగు సాహిత్యంలో కొత్త కెరటాలు వస్తున్నాయి. కథా వస్తువులో కూడా విస్తృతి పెరిగింది. కేవలం సాహిత్యంపైనే ఆధారపడి కెరీర్ నిర్మించుకునేవారూ పెరిగారు. తెలుగులో ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. గాలికి వంగిన పైరు తిరిగి లేచి నుంచుని ఆకాశాన్ని చూసినట్టు, సాహిత్యం తిరిగి లేస్తోంది. దిగంతాల వైపు ప్రయాణిస్తోంది. దానితో పాటు, నిశ్శబ్ధంగా గడిచిన దశాబ్ధాల్లో వచ్చిన గొప్ప సాహిత్యాన్ని కూడా....

Read more

హిట్లర్ నుండి తప్పించుకోవడం ఎలా?

Meena Yogeshwar
March 4, 2025

ప్రపంచ చరిత్రలో ఎందరో రక్తపిపాసులైన వ్యక్తులలో గత శతాబ్దం చూసిన అత్యంత దారుణమైన వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్ అదే చేయబోయాడు. ఐన్ స్టీన్ ను పట్టిచ్చిన వారికి 5000 జర్మనీ మార్క్ ల పారితోషకం ఉండేది. ఆయన రాసిన ఎన్నో పుస్తకాలను తగులబెట్టారు. అవన్నీ Anti-german పుస్తకాలుగా సామాన్య జనంలో ప్రచారం చేశారు. ఇదంతా ఎందుకో తెలుసా? ఆయన ఒక యూదు వ్యక్తి కావడం వలన. అసలు ఇలాంటి వ్యక్తిని జర్మనీ ప్రజలు ఎలా తమ నాయకుణ్ణి చేశారు? వారికి ఆ మాత్రం తెలివి లేదా? ఒక నరహంతకునికి అంతటి శక్తివంతమైన కుర్చీ ఎలా ఇచ్చారు? దీనంతటికీ కారణం...

Read more

మీరు ఏ కాలానికి వెళ్తారు?

Meena Yogeshwar
February 24, 2025

మన భూమి ఉపరితలం కన్నా, core వయసు రెండున్నర సంవత్సరాలు తక్కువని తెలిసి భలే ఆశ్చర్యం వేసింది. కొన్ని గ్రహాల్లో ఒక సంవత్సరం సమయం గడిపితే మన భూమిపై 7, 8 సంవత్సరాలు గడిచిపోతాయి అని తెలిసినప్పుడు ఇంకా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే, ఇలాంటి విషయాలు మన భారతీయ ఇతిహాసాలలో విన్నాను కాబట్టీ. బ్రహ్మకు ఒక రోజు అంటే మానవ సంవత్సరాలలో 100ఏళ్ళు అని, భూమిపై జీవులు, ఇతర లోకాల కన్నా అల్పాయుష్కులు అని విన్న విషయాలన్నీ గుర్తుకువచ్చాయి. మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదు ‘కాలం పరబ్రహ్మ స్వరూపం’ అని. అందులోనే ఎన్నో రహస్యాలు...

Read more