ఆనందాన్ని, బాధను, వేదనను, ఆశ్చర్యాన్ని, ప్రేమను, కోపాన్ని, పరిశీలనను ఇలా ప్రతీదాన్నీ అక్షర రూపంలో అందించిన సుకవులలో ఒకరు విశ్వనాథ. అలాంటివారి ప్రతి జీవన మలుపూ పాఠకుల పాలిట వరాలయ్యాయి. తలెత్తి చూసేందుకు, వెనకనే నడిచేందుకు తమ ప్రతి అడుగునూ తరువాతి వారి కోసం అందించిన వారు, వారి జీవుని వేదన అంతటినీ రచనల రూపంలో పాఠకుల మీద కురిపించి కరిగిపోయిన...
Read more“కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడితో సమానం” అని ఒకప్పటి సామెత. బహుదూరపు ప్రయాణం. అందులోనూ ఎన్నో ఊళ్ళల్లో మజిలీలు, ఆ ఊళ్ళలోని అంటువ్యాధ్యుల దగ్గర నుంచి, మోసాల వరకూ అన్నీటినీ తట్టుకోవాలి. అడవుల్లో ప్రయాణం. క్రూరమృగాల దాడుల నుండి బందిపోట్ల బెడద వరకూ అన్నిటినీ ఎదుర్కోవాలి. భాష కాని భాష, ఊరు కాని ఊరులో ఏదైనా ఇబ్బంది వస్తే అంతే సంగతులు. అప్పటికి రైళ్ళు కాదు కదా, రోడ్లు కూడా లేవు. సరిగ్గా 196 ఏళ్ళ క్రితం ఒక పెద్దమనిషి...
Read moreతెలుగు సాహితీవేత్తలు, కవులు, రచయితలు, పాఠకులు, విమర్శకులు, పరిశోధకుల మధ్య భావజాల మార్పిడికి ఒక వేదిక గొప్ప క్షేత్రం అవుతుంది. ఇటువంటి తెలుగు సభల్లో, సదస్సుల్లో పాల్గొనేవారు తమ సృజనాత్మక రచనలను పంచుకోవడానికి, ఇతరుల నుండి అభిప్రాయం పొందడానికి ఒక వేదికను పొందుతారు. మనం గమనిస్తే ఎక్కడైనా ప్రభుత్వాలు పూనుకుని నిర్వహించిన అభివృద్ది కార్యక్రమాల కంటే, ప్రజలు చైతన్యవంతులై వారికి వారే పూనుకుని ఒక సదస్సుగా కానీ, ఒక బృందంగా కానీ ఏర్పడి ప్రణాళికలు వేసుకుని వాటిని అమలుపరిచినపుడే ఆ కృషి వల్ల జరిగిన అభివృద్ధి ప్రభావం ఎక్కువ కనబడుతుంది. మరి అలాంటి కృషి మన తెలుగు భాషపై జరిగితే..?
Read more