పొన్నియిన్ సెల్వన్ తొలి తెలుగు అనువాదాన్ని శ్రవణ పుస్తకంగా విడుదల చేస్తున్న సందర్భంగా. ఈ భూమి నాది అని ప్రతివారూ అనుకుంటారు. తాను కొన్నాడు కాబట్టి తనది అనుకుంటాడు ఒకడు. తాను పాలించాడు కాబట్టి తనది అనుకుంటాడు మరొకడు. ఈ భూమిలో పుట్టి, ఈ భూమిని ఏలి, తిరిగి ఈ భూమిలోనే కలిసిపోతారు. కానీ ఈ భూమి ఎవడిదీ కాదు. తన మోహ మాయ ఉపయోగించి, ప్రతివాడినీ ఇది నాదీ అనుకోవడం కోసం కొన్నాళ్ళు ఒకరి కింద ఉన్నట్టు నటిస్తుంది ఈ భూమి. వాడి సమయం అయిపోగానే మెల్లిగా తన కడుపులోకి తిరిగి కలిపేసుకుంటుంది.
Read moreభారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ కలం వీరులకు నివాళి. తన తల్లి వినతిని దాస్యం నుండి విముక్తి చేయడానికి గరుత్మంతుడు కష్టపడినట్టు, తమ మాతృభూమిని పరాయి పాలన నుండి రక్షించడానికి ఈ భరత మాత ముద్దు బిడ్డలు ఎందరో పోరాడారు. కొందరు ఆయుధాలతో, కొందరు అహింసా మార్గంలో, మరికొందరు వీరికి స్ఫూర్తిని రగింలించేలా తమ కలాలతో స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. ఈ 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఆ కవి యోధులను స్మరించుకుందాం.
Read moreసినీ వట వృక్షానికి విత్తనం సాహిత్యం. 'అతడు నవ్వడు'. ఇది రాక్షసుడు నవలలో కథానాయకుడిని వర్ణిస్తూ యండమూరి వీరేంద్రనాధ్ గారు చెప్పిన వాక్యం. అది చదివిన వెంటనే పాఠకుడు ఒక ఊహా చిత్రాన్ని గీసుకుంటాడు. తనకు తెలిసిన కళ్ళు, ముక్కు, పెదాలను ఒక చోట పెట్టి, వాటిని ఒక మొహానికి అతికించి, అతడు నవ్వనట్టుగా ఉండే ఆ చిత్రాన్ని తన మస్తిష్కంలో చిత్రించుకుంటాడు. ఆ నవలను అదే పేరుతో చిరంజీవి హీరోగా సినిమా తీశారు దర్శకుడు కోదండరామిరెడ్డి. తెర మీద ఈ సన్నివేశాన్ని మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉండదు. చిరంజీవి ముఖం ఈ సన్నివేశాన్ని మనకు చెప్పేస్తుంది.
Read more