గొప్ప సంగీత విద్వాంసులు కూడా ఉపయోగించడానికి భయపడే బేగడ వంటివి, మరి కొన్ని రాగాలను అలవోకగా, అందంగా వాడేవారు. అలాంటి క్లిష్టమైన రాగాలను కూడా ఉపయోగించాలంటే ఎంత విద్వత్తు ఉండాలి, సంగీతంపై ఎంత పట్టు ఉండాలి. ఆ పట్టు, విద్వత్తు వారి తండ్రి సన్యాసిరాజు గారి చలవే. ఎంతో కష్టపడి, శ్రమకోర్చి తన కుమారులు ఇద్దరికీ గొప్ప గొప్పవారి దగ్గర సంగీతం నేర్పించారు సన్యాసిరాజు గారు.ఈ అభ్యాసం అంతా వారిని తెలుగు సినీ రంగంలో గొప్ప సంగీత దర్శకునిగా నిలిబెట్టింది. తబలా, మృదంగం, హార్మోనీయం, పియానో, మాండలిన్, గిటార్, వయోలిన్ ఇలా ఎన్నో సంగీత వాద్యాలను అలవోకగా వాయించేవారు. మరి వారు ఎవరంటే ..
Read moreమల్లీశ్వరి, మిస్సమ్మ, విప్రనారాయణ, మాయాబజార్, చెంచులక్ష్మి, అప్పు చేసి పప్పు కూడు, ఇద్దరు మిత్రులు, కులగోత్రాలు, చదువుకున్న అమ్మాయిలు, పూజా ఫలం, అమరశిల్పి జక్కన్న, డాక్టర్ చక్రవర్తి, భక్త పోతన, భక్త ప్రహ్లాద… వీటన్నిటికీ ఒక common విషయం ఉంది. అదేమంటే, ఈ సినిమాలు ఎంతటి విజయం సాధించాయో, ఆ సినిమాలలోని పాటలూ అంతే గొప్పగా నిలిచాయి. వీటన్నిటి సంగీతాన్ని మనకి అందించిన గొప్ప సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు గారు. మన సినీ సంగీత స్థాయిని పెంచినవారిలో ఆయన ఒకరు. ఈ విషయంపై సాధికారికంగా మాట్లాడగలవారిని మేము వెతకాల్సిన అవసరం లేకపోయింది. ఎందుకంటే ...
Read moreమాటలనిపించుకోవడం రాముడికి కొత్తేమీ కాదు. 'పెట్టాలన్నా, కొట్టాలన్నా అమ్మే' అని సామెత. అలా తిట్టాలనుకోవాలన్నా, సర్వస్య శరణాగతి చేయాలన్నా రామ భక్తులకే సాధ్యం. అదంతా ఆ రాముడు వారికిచ్చే చనువు. అలాంటి రాముడు మా దాసుకిరణ్ గారితో కూడా నాలుగు వాక్యాలు రాయించుకున్నాడు. అవేమిటంటే...
Read more