బతుకు నుంచి చావు దాకా, ప్రేమ నుంచి విరహం దాకా, నవ్వు నుంచి విషాదం దాకా, విప్లవం నుంచి శాంతి దాకా దేని మీదైనా వాళ్ళ అభిప్రాయం వెలువడని విషయం లేదు అంటే అతిశయోక్తి కాదు. కథా గమనానికే కాదు అప్పుడప్పుడు నాలుగు రోడ్ల కూడలిలో మన జీవితం ఇరుక్కుపోయినప్పుడు కూడా తమ అక్షరాలతో ముందుకు నడపడానికి సారధ్యం వహించడమే వాళ్ళ పని. మన జీవితంలో ఎదురయ్యే అన్ని సందర్భాలలోనూ ఆ సినీ సాహిత్య కర్షకుల ఫలాలను ఉపయోగించుకున్నవాళ్ళమే మనమందరం. సాహితీ లోకంలో ఇప్పటికీ చాలా చిన్న చూపు చూడబడుతున్న....
Read moreశిశువు అంటే కుమారస్వామి - ఆయన సామవేద ప్రియుడు, ఓంకారానికి వ్యాఖ్యానకర్త కదా, పశువు అంటే నందీశ్వరుడు - ఢమరుక శబ్ధం ఆయనకి తప్ప ఎవరికి పూర్తిగా అర్ధం అవుతుంది, ఫణి అంటే శేషుడు - విష్ణువు చేతిలోని శంఖ నాదమే ఆ పరమాత్మను మోయడానికి శేషుడికి శక్తినిస్తోంది అని కొందరు అంటారు. అందుకే వారికి మాత్రమే గానంలోని అసలైన రసం అందుతుంది, కానీ కవి ఉద్దేశించిన తత్త్వం ఈశ్వరుడికైనా అర్ధం అవుతుంది అని చెప్పలేము అని కొందరు వ్యాఖ్యానించారు. ఎవరు వ్యాఖ్యానించినది తీసుకున్నా సంగీతం ప్రపంచ భాష అని, అందులో...
Read moreమన మానసిక ఆరోగ్యం, మెదడులో విడుదలయ్యే hormones వంటివి మన పూర్తి ఆరోగ్యంపై, తద్వారా మన జీవితంపై ఎంత ప్రభావం చూపిస్తాయో చాలామంది గుర్తించరు. ఇది చాలా ముఖ్యమైన అనారోగ్యం కాబట్టీ, వైద్యుల సహాయమే దీనికి పరిష్కారం. అయితే, చాలాసార్లు మన సాహిత్యం కూడా ఈ ఇబ్బంది నుండి మనని బయటపడేయడానికి, కనీసం మనకున్న రోగాన్ని గుర్తించడానికో ఉపయోగపడుతుంది. అలాంటిది ఈ రోగాలను, వాటి లక్షణాలనూ క్షుణ్ణంగా అర్ధం చేసుకున్న ఒక వైద్యురాలు సాహిత్యం రాస్తే ఎలా ఉంటుంది?
Read more